Mosagallu Collections: థియేటర్ రన్ కంప్లీట్..మోసగాళ్లుకు చివరకు మిగిలింది ఇదే!

Mosagallu Collections: మంచు విష్ణు హీరోగా రూపొందింన ప్రతిష్టాత్మక చిత్రం మోసగాళ్లు. గత వారం రిలీజ్ అయినా ఈ సినిమా భారీ పరాభవం మూటకట్టుకుంది. తీవ్ర నష్టాలు మిగిల్చింది.

Samba Siva Rao
Published on: 26 March 2021 3:33 PM IST
Mosagallu movie Long Run Collections
X

మోసగాళ్లు మూవీ ఇమేజ్ ఫైల్ ఫోటో 

Mosagallu Collections: మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన చిత్రం "మోసగాళ్ళు". టాలీవుడ్ అగ్రకథానాయక కాజల్ అగర్వాల్‌ కీలక పాత్ర పోషించింది. మోసగాళ్ళు మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్యాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో యాదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విష్ణు హీరోగా నటించడంతో పాటు స్వయంగా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ విష్ణు అక్కగా నటించింది. 2016లో జరిగిన ఈ 450 మిలియన్ డాలర్ల స్కామ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు.

సినిమా విడుదల ముందే ట్రైలర్ టీజర్ తో అంచనాలు పెంచింది. విడుదల అయినా మొదట్లో కాస్త డీసెంట్ టాక్‌ తెచ్చుకున్న రెండు రోజులకే సినిమా పనైపోయింది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడలో ఒకేసారి రిలీజ్ చేసారు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్ సంగీతం అందించాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీసు పాత్రలో, నవదీప్ కూడా కీలక పాత్రలో నటించారు.

మోసగాళ్ళు మూవీ 20 కోట్ల రూపాయలుపైగా బిజినెస్ చేయగా.. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో సాధించాల్సి ఉంది. అయితే ఇప్పటికి వరకు ఇటు తెలంగాణ అటు ఏపీ కలుపుకుని 0.81 షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ మొత్తంగా 0.99 CR షేర్ వసూలు చేయగా.. టోటల్ గ్రాస్ 1.90 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా 20 కోట్ల వరకు నష్టాలు సినీ విశ్లేషకులు అంటోన్నారు.

ఇక విష్ణు హీరోగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ విషయం తెలిసిందే. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కనున్న ఈ పౌరాణిక చిత్రంలో విష్ణు 'భక్త కన్నప్ప'గా కనిపించనున్నాడు. కాజల్ విషయానికి వస్తే మెగాస్టార్ హీరోగా నటిస్తోన్న ఆచార్య సినిమాలో కథానాయకగా నటిస్తొంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సరసన కనిపించనుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story