Vishnu: దేవుడి దయతో నా డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తా: మంచు విష్ణు

Manchu Vishnu: "దేవుడి దయతో.. అన్నీ సక్రమంగా జరిగితే.. నా డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తా" నని మంచు విష్ణు అన్నాడు.

Venkata Chari
Published on: 25 March 2021 8:05 PM IST
My deram project is Bhakta Kannappa says Manchu vishnu
X
మంచు విష్ణు (ఫొటో ట్విట్టర్)

Manchu Vishnu: "దేవుడి దయతో.. అన్నీ సక్రమంగా జరిగితే.. నా డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తా" నని హీరో మంచు విష్ణు ఓ ఇంటర్య్వూ లో అన్నాడు. 'మోసగాళ్లు' సినిమాతో గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మంచు వారబ్బాయి. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడాడు.

"మోసగాళ్లు సినిమా మంచి టాక్ తో రన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం శ్రీను వైట్లతో 'డీ అండ్ డీ' సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో వినోదం, యాక్షన్ లు రెండు డబుల్ డోస్ లో ఉంటాయి. అందుకే డీ అండ్ డీ అనే టైటిల్ పెట్టాం. అంతేకాని, ఇది డీ సినిమాకు స్వీక్వెల్ కాదు. శ్రీను వైట్ల సినిమా తరువాత నా డ్రీమ్ ప్రాజెక్ట్ 'భక్త కన్పప్ప' చేస్తాను. దీనికి దేవుడి దయతో అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాను. కథ ఫైనలైజ్ లో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీస్తాం. అలాగే భారీ యాక్షన్ మూవీ కూడా" అని హీరో విష్ణు వెల్లడించారు.

Venkata Chari

Venkata Chari

Next Story