Mithun Chakraborthy: ఆసుపత్రి బెడ్ పై మిథున్ చక్రవర్తి ఫొటో వైరల్

Mithun Chakraborthy: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Arun Chilukuri
Updated on: 2 May 2022 9:45 PM IST
Mithun Chakraborty Hospitalised
X

Mithun Chakraborthy: ఆసుపత్రి బెడ్ పై మిథున్ చక్రవర్తి ఫొటో వైరల్

Mithun Chakraborthy: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మిథున్ చక్రవర్తి ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేమైందో తెలియక మిథున్ అభిమానులు సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. ఈ నేపథ్యంలో మిథున్ కుమారుడు మిమో చక్రవర్తి స్పందించారు. కిడ్నీలో రాళ్లు ఉండడంతో తన తండ్రి నొప్పితో బాధపడ్డారని, అందుకే ఏప్రిల్ 30న ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. డాక్టర్లు సర్జరీ చేశారని, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో చెప్పారు. మిథున్ ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story