'మిస్టర్ మజ్ను' క్లోజింగ్ కలెక్షన్స్

మిస్టర్ మజ్ను క్లోజింగ్ కలెక్షన్స్
x
Highlights

వరుసగా రెండు ఫ్లాపులను అందుకున్న యువ హీరో అక్కినేని అఖిల్ ఈ మధ్యనే తన మూడవ సినిమా 'మిస్టర్ మజ్ను' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'తొలిప్రేమ' ఫేమ్...

వరుసగా రెండు ఫ్లాపులను అందుకున్న యువ హీరో అక్కినేని అఖిల్ ఈ మధ్యనే తన మూడవ సినిమా 'మిస్టర్ మజ్ను' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ లేకపోయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమవ్వడంతో కలెక్షన్లు కూడా డీలా పడిపోయాయి.

ఇక విడుదలైన రెండు వారాల నుండి థియేటర్లన్నీ ఖాళీ అయిపోవడంతో ఈ సినిమా కనిపించకుండా పోయింది. ఇవాల్టి తో ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా 12.82 కోట్లు వసూలు చేసింది మిస్టర్ మజ్ను. విడుదలైన దాదాపు అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్లుగా తెలుస్తోంది. అఖిల్ మునుపటి రెండు సినిమాల కంటే ఈ సినిమా దారుణంగా కలెక్షన్లను నమోదు చేయడం గమనార్హం. ఓవర్సీస్ లో కూడా కనీసం కోటి రూపాయలు వసూలు చేయలేక పోయింది 'మిస్టర్ మజ్ను'.

ఏరియాల వారిగా 'మిస్టర్ మజ్ను' క్లోజింగ్ కలెక్షన్స్:

నైజాం : 3.9 కోట్లు

సీడెడ్ : 1.48 కోట్లు

వైజాగ్ : 1.31 కోట్లు

గుంటూరు : 1.20 కోట్లు

కృష్ణ : 82 లక్షలు

నెల్లూరు : 41 లక్షలు

వెస్ట్ : 58 లక్షలు

ఈస్ట్ : 72 లక్షలు

ఏపీ మరియు నైజాం : 1042 కోట్లు

కర్ణాటక : 1.15 కోట్లు

యూఎస్ : 75 లక్షలు

ఇతర : 50 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా : 12.82 కోట్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories