గెలిచేవాడిదే జీవితం.. 'మిస్ మ్యాచ్' టీజర్ లో ఉదయశంకర్ ఆదరగొట్టాడుగా!

గెలిచేవాడిదే జీవితం.. మిస్ మ్యాచ్ టీజర్ లో ఉదయశంకర్ ఆదరగొట్టాడుగా!
x
Highlights

'ఆటగదరా శివా' సినిమాతో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన హీరో ఉదయశంకర్ ఇప్పుడు 'మిస్ మ్యాచ్' అంటూ దూసుకు వస్తున్నాడు.

'ఆటగదరా శివా' సినిమాతో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన హీరో ఉదయశంకర్ ఇప్పుడు 'మిస్ మ్యాచ్' అంటూ దూసుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదల చేశారు విక్టరీ వెంకటేష్. బలమే జీవితం..బలహీనతే చావు అంటూ మొదలైన ఈ టీజర్ అందర్నీ అలరిస్తోంది.

ఉదయశంకర్ యగ్రీ యంగ్ మాన్ లుక్ లో నడుస్తూ వస్తున్న లుక్ ఆదరగొట్టేసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ లా కనిపిస్తున్న ఈ టీజర్ లో వినిపించిన డైలాగులు చాలా బలంగా ఆకట్టుకుంటున్నాయి. తన మొదటి సినిమాతోనే యాక్షన్ సన్నివేశాలతో చక్కని ఈజ్ కనబరచిన ఉదయ్ శంకర్ ఈ టీజర్ లో దానిని కొనసాగించినట్టు కనిపించింది. గెలుపే లక్ష్యం.. గెలిచేదాకా పరిగెట్టు వంటి డైలాగులు సినిమా రేంజి ని చూపిస్తున్నాయి. ఇక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ స్పోర్ట్స్ స్టార్ లా కనిపిస్తూ సినిమా పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' పతాకంపై నిర్మితమౌతున్న ఈ 'మిస్ మ్యాచ్' సినిమాకి ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ అంటోనీ హీరోగా తమిళంలో సలీం వంటి వియవంతమైన సినిమాకి దర్శకత్వం వహించిన నిర్మల్ కుమార్ కి ఇది తొలి తెలుగు సినిమా. జి. వి. జి. రాజు సమర్పణలో శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మాతలుగా తొలి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకి గిప్తాన్ ఎలైస్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తమ్మీద టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే ఈ యాక్షన్ లవ్ స్టొరీగా 'మిస్ మ్యాచ్' రూపొందుతోందని సినీవర్గాలు చెబుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories