Abhishek Banerjee: తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తున్న మీర్జాపూర్ నటుడు

admin1
Updated on: 5 Aug 2021 5:08 PM IST
Mirzapur Fame Actor Abhishek Banerjee Debut in Anand Deverakonda New Movie
X

అభిషేక్ బెనర్జీ (ట్విట్టర్ ఫోటో)

Abhishek Banerjee: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు గా ఆనంద్ దేవరకొండ "దొరసాని" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించిన ఆనంద్ దేవరకొండ ఈ మధ్యనే "మిడిల్ క్లాస్ మెలోడీస్" అనే సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కె.వి.గుహన్ దర్శకత్వం లో ఒక ఆసక్తికరమైన సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాకు "హైవే" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. మలయాళం బ్యూటీ మానసా రాధాకృష్ణన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తో ఒక బాలీవుడ్ నటుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.

అతను ఎవరో కాదు అభిషేక్ బెనర్జీ. తెలుగు ప్రేక్షకులకు కొత్త వాడే అయినప్పటికీ అభిషేక్ బెనర్జీ "పాతాళ్ లోక్", "మిర్జాపూర్" వంటి వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో కనిపించిన అభిషేక్ బెనర్జీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అభిషేక్ కు ఈ సినిమాలో ఒక అద్భుతమైన ఆ పాత్ర దక్కిందని సమాచారం. అయితే ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయం పై దర్శక నిర్మాతలు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమా గురించిన మరిన్ని విషయాలు త్వరలో వెలువడనున్నాయి.

admin1

admin1

Next Story