Vidya Balan: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం

Vidya Balan: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ విద్యాబాలన్ మరో ఘనతను సాధించింది.

Kranthi
Published on: 6 July 2021 7:21 AM IST
Military Firing Range Named After Vidya Balan in Kashmir
X

Vidya Balan

Vidya Balan: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ విద్యాబాలన్ మరో ఘనతను సాధించింది. అందంతో పాటు అభినయం కలిసి.. మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది విద్యాబాలన్. నటన కోసం సిల్క్ స్మిత లాంటి బోల్డ్ కేరెక్టర్ కూడా చేసి.. అందాల కన్నా.. తన నటన గురించే అందరూ మాట్లాడుకునేలా చేసింది. ప్రతి కేరెక్టర్ ను ఓ ఛాలెంజ్ లా తీసుకుని నటించే విద్యాబాలన్.. తన వయసుతో సంబంధం లేకుండా కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఆ అద్భుత నటికి అరుదైన గౌరవం దక్కింది.

జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు విద్యా బాలన్‌గా ఇండియన్ ఆర్మీ నామకరణం చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందిస్తున్న అసాధారణ సేవలకు గుర్తుగా ఆ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరును పెట్టినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ ప్రదేశం కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఉంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నప్పటికీ.. ఈ అంశంపై విద్యా బాలన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్‌ ఆర్మీ నిర్వహించిన వింటర్‌ ఫెప్టివల్‌కు విద్యాబాలన్‌.. ఆమె భర్త సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌తో కలిసి హాజరయ్యారు. ఆస్కార్‌ అవార్డుల పాలకమండలి 'అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ సైన్సెస్‌'లో చేరాలంటూ ఆమెకు ఇన్విటేషన్ అందిన విషయం తెలిసిందే. ఆమె నటించిన 'షేర్నీ' మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఇటీవల విడుదలైంది. అందులో ఆమె పోషించిన పాత్రపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story