Mehreen Kaur Pirzada: అలాంటి సన్నివేశాల్లో నటించను అంటున్న మెహరీన్

Mehreen Kaur Pirzada says no to Bold Content scenes Movies | Tollywood News
x

 అలాంటి సన్నివేశాల్లో నటించను అంటున్న మెహరీన్

Highlights

Mehreen Kaur Pirzada: ముద్దు సన్నివేశాలకు నో అంటున్న మెహరీన్

Mehreen Kaur Pirzada: "కృష్ణ గాడి వీర ప్రేమ కథ" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన మెహరీన్ పిర్జాదా "మహానుభావుడు", "రాజా ది గ్రేట్" వంటి సూపర్ హిట్ లని కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మధ్య నే సంతోష్ శోభన్ హీరోగా నటించిన "మంచి రోజలోచ్చాయి" అనే సినిమాలో హీరోయిన్ గా కనిపించిన మెహరీన్ ఇప్పుడు "ఎఫ్ 3" సినిమాతో బిజీగా ఉంది.

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన "ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్" సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కనుంది. అయితే బికినీ వేసుకుని కెమెరా ముందుకి రావడానికి కూడా అభ్యంతరం లేని మెహరీన్ ఇప్పుడు ముద్దు సన్నివేశాలకు కూడా నిరాకరిస్తోంది. తాజాగా ఇప్పుడు ఆమె ఈ విషయంలో కొన్ని లిమిట్లు పెట్టబోతోంది.

ముద్దు మరియు బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడానికి మాత్రం ఒప్పుకోవటం లేదు. బోల్డ్ నటి గా గుర్తింపు రాకూడదు అని నిర్ణయించుకున్న మెహరీన్ ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేసింది. ఈ నేపథ్యంలోనే ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయని మెహరిన్ ఇప్పటికే పలు ప్రాజెక్టులను రిజెక్ట్ చేసినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories