నాని తో రొమాన్స్ చేయనున్న నితిన్ హీరోయిన్

Megha Akash
x
Megha Akash
Highlights

వరుసగా 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' లాంటి రెండు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత నాచురల్ స్టార్ నాని ఈసారి క్రికెటర్ అవతారంలో 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

వరుసగా 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' లాంటి రెండు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత నాచురల్ స్టార్ నాని ఈసారి క్రికెటర్ అవతారంలో 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత నాని, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. హీరోయిన్ కోసం ఒక ఫ్రెష్ ఫేస్ ను దర్శక నిర్మాతలు వెతుకుతున్నారని వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం మేఘా ఆకాశ్ ఈ సినిమాలో నాని తో రొమాన్స్ చేయనుందట. నితిన్ నటించిన నటించిన 'లై' సినిమా తో అరంగేట్రం చేసిన మేఘా ఆకాష్ 'చల్ మోహన్ రంగా' సినిమా లో కూడా కనిపించింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు.తెలుగులో ఆఫర్లు పెద్దగా రాకపోయినా తమిళంలో పలు సినిమాలలో హీరోయిన్ ఆఫర్లు పొందిన మేఘా ఆకాష్ ఇప్పుడు నాని విక్రమ్ సినిమా ను ఓకే చేసిందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories