Konidela Chiranjeevi: సూపర్‌స్టార్ కృష్ణ మరణం మాటలకు అందని విషాద౦..!

* మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో సంతాపం తెలిపారు.

R Tripura Malini
Updated on: 15 Nov 2022 1:03 PM IST
MegaStar Chiranjeevi Mourns The loss Of Super Star Krishna
X

సూపర్‌స్టార్ కృష్ణ మరణం మాటలకు అందని విషాద౦

Megastar Chiranjeevi: సూపర్‌స్టార్ కృష్ణ మరణం మాటలకు అందని విషాదమని హీరో చిరంజీవి ట్వీట్ చేశారు. నటశేఖరుడు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదన్నారాయన కృష్ణ మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం లాంటి వారని సాహసానికి ఊపిరి ధైర్యానికి పర్యాయ పదం వంటి వారన్నారు. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం కలబోతయే కృష్ణ అని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని మహేశ్‌బాబుకు కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతిని వ్యక్తం చేశారు చిరంజీవి.

R Tripura Malini

R Tripura Malini

Next Story