Chiranjeevi Urban Monk Look : మెగాస్టార్ కొత్త లుక్ వెనుక అసలు కథ ఇదన్నమాట!

Chiranjeevi Urban Monk Look : మెగస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి వచ్చాక చాలా యాక్టివ్ అయ్యారు.. ఎప్పటికప్పుడు ఏదొక

Krishna
Published on: 15 Sept 2020 12:49 PM IST
Chiranjeevi Urban Monk Look : మెగాస్టార్ కొత్త లుక్ వెనుక అసలు కథ ఇదన్నమాట!
X

Megastar Chiranjeevi Making of the Urban Monk Look

Chiranjeevi Urban Monk Look : మెగస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి వచ్చాక చాలా యాక్టివ్ అయ్యారు.. ఎప్పటికప్పుడు ఏదొక అప్డేట్ ను ఇస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.. తాజాగా గుండు లుక్ లో కనిపించి వావ్ అనిపించారు.. ఈ లుక్ లో చిరు నున్నటి గుండు, నల్లటి కళ్లద్దాలతో 'అర్బన్‌ మాంక్‌' స్టైల్‌లో కనిపించారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అభిమానుల్లో మాత్రం చాలా సందేహాలు నెలకొన్నాయి.

నిజంగానే చిరు గుండు చేయించుకున్నారా లేకా ఏదైనా యాప్ వాడారా .. లేకా అదేమైనా ఎడిటింగా అని ఇలా చాలా ప్రశ్నలు అభిమానుల మదిలో నెలకొన్నాయి. ఎం అయితే ఈ ప్రశ్నలకి ఒక్క వీడియోతో సమాధానం ఇచ్చారు చిరంజీవి..''మేకింగ్‌ ఆఫ్ అర్బన్‌ మాంక్‌'' అంటూ తన కొత్త లుక్‌ ఎలా సాధ్యమయిందో వీడియో ద్వారా తెలియచేశారు చిరంజీవి.. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇక గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రాన్ని చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది. తాజాగా మెగస్టార్ పుట్టినరోజున రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..



Krishna

Krishna

Next Story