Megastar Chiranjeevi New Look: వారెవ్వా..కొత్తలుక్ లో చిరంజీవి..అదిరిపోలే..!
Megastar Chiranjeevi New Look | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కొత్త కొత్త లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొనే విషయం తెలిసిందే.
Megastar Chiranjeevi New Look
Megastar Chiranjeevi New Look | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కొత్త కొత్త లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొనే విషయం తెలిసిందే. చిరంజీవి సోషల్ మీడియాలో ఆక్టివ్ అయినప్పటినుండి ఎప్పటికప్పుడు ఎదో ఒక అప్ డేట్ ఇస్తూ తన అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు. అయితే, లేటెస్ట్ గా తన కొత్త లుక్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అయితే, కొత్త లుక్ తో అందరినీ ఆశ్యర్య పరిచాడు.
తను గుండుతో ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరిని ఆశ్యర్య పరిచాడు. "నేను సన్యాసిలా ఆలోచించగలనా" అని ఆ ఫొటోకు క్యాప్షన్ ను జత చేసాడు. అయితే, ఈ లుక్ తన సినిమా కోసమా? లేక మరేంటన్నది అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ఆర్ట్స్ బ్యానర్ పై ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రీలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.




