మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్... మెగా అభిమానికి మెగా సాయం

Megastar Chiranjeevi: సోషల్‌మీడియా ద్వారా వెంకట్‌ గురించి తెలుసుకున్న చిరంజీవి...

Shireesha
Updated on: 24 Oct 2021 2:16 PM IST
Megastar Chiranjeevi Helps Fan Struggling with Health Problem | Tollywood News
X

మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్... మెగా అభిమానికి మెగా సాయం

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడు తన అభిమానులకు అండగా ఉంటారు. ఆపద వచ్చిందని ఎవరూ తలుపుతట్టినా ఆదుకుంటారు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభిమానికి సాయం అందించారు చిరంజీవి. విశాఖ జిల్లాకు చెందిన వెంకట్‌ కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతున్నాడు. అయితే తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలని నిశ్చయించుకున్నాడు వెంకటేష్‌. ట్విట్టర్‌ ద్వారా మిమ్మల్ని కలవాలి సర్‌ అంటూ వెంకటేష్‌ రిక్వెస్ట్‌ చేశారు.

ఈ ట్వీట్‌ చూసిన మెగాస్టార్‌ వెంటనే స్పందించారు. వెంకట్‌ ఆయన భార్య సుజాతకు చిరంజీవి ఫ్లైట్‌ టికెట్స్ పంపించారు. వారిని హైదరాబాద్‌లోని తన ఇంటికి రప్పించి వారితో 45 నిమిషాలు మాట్లాడారు. వెంకట్‌ అనారోగ్యం గురించి తెలుసుకొని వారికి అండగా ఉంటానని చిరు హామీ ఇచ్చారు. చిరు ఇంటి నుంచి వారిని నేరుగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి పంపించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడి వెంకట్‌ ఆరోగ్యపరిస్థితిపై వాకబ్‌ చేశారు. ఇక చికిత్స అయ్యే ఖర్చునంత తానే భరిస్తానని వెంకట్‌ ఫ్యామిలీకి చిరంజీవి భరోసా ఇచ్చారు.

ఇక మెగాస్టార్‌ దాతృత్వాన్ని చూసిన మెగా అభిమానులు దటీజ్‌ చిరంజీవి అంటూ కొనియాడుతున్నారు. తన అభిమానిగా ఉన్నందుకు గ్వరంగా ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. తమ తోటి అభిమాని అయిన వెంకట్‌ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

Shireesha

Shireesha

Next Story