Godfather: మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..?

Godfather: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.

Arun Chilukuri
Updated on: 10 May 2022 5:30 PM IST
MegaStar Chiranjeevi God Father Release Date Confirmed
X

Godfather: మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..?

Godfather: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఇక ప్రస్తుతం మెగా అభిమానులందరూ మెగాస్టార్ తదుపరి సినిమాల పైనే ఆశలు పెట్టుకున్నారు. మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ అనే సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నారు.

తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఆగస్టు 11న భారీ ఎత్తున థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నయనతార సత్య దేవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆచార్య సినిమాతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులు కనీసం ఈ సినిమాతో అయినా మెగాస్టార్ మంచి హిట్ అందుకుంటారని ఆశిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story