Megastar Chiranjeevi Birthday Wishes to Pawan Kalyan: తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్...

Megastar Birthday Wishes to Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా..

S. Srikanth
Updated on: 2 Sept 2020 11:57 AM IST
Megastar Chiranjeevi Birthday Wishes to Pawan Kalyan: తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్...
X

Chiranjeevi and Pawan Kalyan (Twitter Photos)

Megastar Birthday Wishes to Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా.. ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్ లు ఒక నటుడు స్థాయిని పెంచాలో తగ్గించాలో డిసైడ్ చేస్తాయి.. కానీ వాటితో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ వ్యక్తి నుంచి శక్తిగా ఎదిగారు పవన్.. నేడు పవన్ కళ్యాణ్ తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు..

ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ''తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు''. కళ్యాణ్ బాబు Happy Birthday అంటూ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.



అయితే, చిత్తూర్ లో పవన్ బర్త్ డే బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo.. అంటూ చిత్తూర్ లో జరిగిన సంఘటన గురించి ప్రస్తవిస్తూ ట్వీట్ చేసారు.



S. Srikanth

S. Srikanth

Next Story