త్వరలో మరొక మెగా హీరో ఎంట్రీ

త్వరలో మరొక మెగా హీరో ఎంట్రీ
x
Highlights

ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి చాలామంది మెగా హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ మధ్యనే ఈ మెగా హీరోల జాబితాలో వైష్ణవ్ తేజ్ చేరనున్నాడు. 'సుప్రీమ్' హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ ఇప్పుడు సినిమాల్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి చాలామంది మెగా హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ మధ్యనే ఈ మెగా హీరోల జాబితాలో వైష్ణవ్ తేజ్ చేరనున్నాడు. 'సుప్రీమ్' హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ ఇప్పుడు సినిమాల్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు.

అయితే ఈ సినిమాను త్వరలో లాంచ్ చేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. నానాక్రమ్ గూడ స్టూడియోస్ లో ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వేడుకకు మెగా స్టార్ చిరంజీవి రానున్నారని తెలుస్తోంది. మెగా హీరోలు అందరికీ మెగాస్టార్ అండ ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ మెగా మేనల్లుడు కి కూడా సపోర్ట్ అందిస్తూ చిరు ఈ వేడుకకు రానున్నారని సమాచారం. మరి వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా తో హిట్ అందుకుంటాడా లేదా చూద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories