సరికొత్త అవతారంలో కనిపించనున్న మెగా ప్రిన్స్

సరికొత్త అవతారంలో కనిపించనున్న మెగా ప్రిన్స్
x
Highlights

వైవిధ్యభరితమైన పాత్రలతో తన ప్రతి సినిమాలోనూ కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో సూపర్ హిట్ ను...

వైవిధ్యభరితమైన పాత్రలతో తన ప్రతి సినిమాలోనూ కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకోవడం కోసం వరుణ్ తేజ్ ప్రస్తుతం యూఎస్ వెళ్ళాడు.

ఈ సినిమా కోసం వరుణ్తేజ్ సన్నగా మారనున్నాడు. దాని కోసం అమెరికా వెళ్లి కష్టపడి సరికొత్త లుక్తో తిరిగి రానున్నాడు. ఈ సినిమా కోసం ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా బాగా బరువు తగ్గి ఫిట్ గా మారనున్నాడు ఈ మెగా హీరో. మిగతా హీరో లాగానే తాను కూడా సిక్స్ ప్యాక్ చేయగలనని అందరికీ నిరూపించాలని కసితో ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కొత్త లుక్ చూడాలని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories