పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తున్న మెగా హీరో

Pawan Kalyan: పవర్ స్టార్ స్టైల్ ఫాలో అవుతున్న వైష్ణవ్ తేజ్

Jyothi
Published on: 28 Jun 2022 12:34 PM IST
Mega hero Imitating Pawan Kalyan
X

పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తున్న మెగా హీరో

Pawan Kalyan: గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "భీమ్లా నాయక్" సినిమాతో కనిపించారు కానీ త్వరలోనే పవన్ కళ్యాణ్ మళ్లీ తన రాజకీయ పనుల్లో బిజీ కాబోతు. అయితే తాజాగా ఒక మెగా హీరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మ్యనరిజం ని ఇమిటేట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన మరెవరో కాదు పంజా వైష్ణవ్ తేజ్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు గా ఇండస్ట్రీలో "ఉప్పెన" సినిమాతో అడుగుపెట్టిన వైష్ణవ్ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు. కొండపొలం సినిమా తో పర్వాలేదనిపించిన వైష్ణవ్ తేజ్ తాజాగా ఇప్పుడు "రంగ రంగ వైభవంగా" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

"రొమాంటిక్" ఫేమ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గిరీసయ్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అయితే ఆఖరి లో వైష్ణవ్ అటు ఇటు చూస్తూ తన మావయ్య పవన్ కళ్యాణ్ లాగా ఎక్స్ప్రెషన్ లు పెట్టడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరో పవన్ కళ్యాణ్ అంటూ అభిమానులు పొగుడుతున్నారు. ఏదేమైనా వైష్ణవ్ తేజ్ నటన ఇప్పుడు ఈ సినిమాకి మంచి బజ్ తెచ్చి పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఇది ఈ సినిమా సక్సెస్ కి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Jyothi

Jyothi

Next Story