నిర్మాతగా మారనున్న అల్లు అర్జున్ అన్నయ్య

భారీ అంచనాల మధ్య విడుదలైన 'అంతరిక్షం' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. వెంకి రేంజికి మ్యాచ్ అయ్యేలా కామెడీని పండించి ప్రేక్షకులను బాగానే మెప్పించాడు ఈ యువ హీరో.
భారీ అంచనాల మధ్య విడుదలైన 'అంతరిక్షం' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. వెంకి రేంజికి మ్యాచ్ అయ్యేలా కామెడీని పండించి ప్రేక్షకులను బాగానే మెప్పించాడు ఈ యువ హీరో. ఇక వరుణ్ తేజ్ తర్వాతి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఒక కొత్త దర్శకుడిని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ వరుణ్ తేజ్ తన కొత్త సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాలో ఒక బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు వరుణ్ తేజ్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు అర్జున్ అన్నయ్య అయిన అల్లు బాబి ఈ సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు.
అంటే మెగా హీరో సినిమాను అల్లు హీరో అన్నయ్య నిర్మించనున్నాడు అన్నమాట. ఇప్పటిదాకా స్పోర్ట్స్ నేపథ్యంలో కనిపించని వరుణ్ ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక వరుణ్ తేజ్ అనిల్ సుంకర నిర్మాణంలో ఒక్క సినిమాకు సైన్ చేశాడు కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. తన సినిమా చేయకుండా వేరే వాళ్ళతో సినిమా చేస్తున్నందుకు అనిల్ సుంకర వరుణ్ తేజ్ పై మండి పడుతున్నారు. మరి ఈ మెగా హీరో ఇప్పుడు అల్లు బాబీ తో సినిమా తీస్తాడా లేక అనిల్ నిర్మాణంలో నటిస్తాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Tamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత
28 May 2022 10:07 AM GMTRam Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్
28 May 2022 9:48 AM GMTPM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMTకలవరపెడుతున్న మంకీపాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు
28 May 2022 8:59 AM GMTSSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMT