Nagababu: బాలీవుడ్‌ ఎంట్రీ.. ఆ హీరోకు విలన్‌గా మెగా బ్రదర్

Nagababu New Look
x

నాగ బాబు 

Highlights

Nagababu: సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు.

Nagababu: సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాల్లో దేశవ్యాప్తంగా వారికంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో సూపర్ హిట్ సాధించి రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో గుర్తుండిపోయ చిత్రం 'ఛత్రపతి'.

'ఛత్రపతి' సినిమాకు తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా ప్రభాస్, రాజమౌళి కెరీర్ లో ఓ మైల్డ్ స్టోన్ గా నిలిచింది. అయితే ఈ మూవీని హిందీ రీమేక్‌లో చేయనున్నారు. ఈ సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో వివి వినాయక్ ఈ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా మెగా బ్రదర్ నాగబాబు విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

ఈ సినిమాలో నాగబాబు మెయిన్ విలన్‌గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో నటించడానికి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో నాగబాబు ఈ సినిమాలో నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఇప్పటికే నాగబాబు తన పాత్రకు సంబంధించి టెస్ట్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. తాజా నాగబాబు లూక్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. మొన్నటి వరకు తెల్ల గడ్డం‌తో కనిపించిన మెగా బ్రదర్.. తాజాగా గడ్డాన్ని ట్రిమ్ చేసి చేతిలో సిగరెట్‌‌తో ముఖంపై ఘాటుతో మాస్ లుక్‌లో కెవ్వు కేక పుట్టిస్తున్నాడు. మొత్తంగా నాగబాబు కొత్త కొత్త లుక్స్‌తో కనిపించడంతో మెగా అభిమానులు ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories