Manushi Chhillar: ఆ టాలీవుడ్‌ హీరోకు పెళ్లి అవ్వకపోతే డేటింగ్‌కు వెళ్లేదాన్ని..

Manushi Chhillar: ప్రపంచ మాజీ సుందరి, ప్రముఖ నటి మానుషి చిల్లర్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Arun Chilukuri
Published on: 3 Jun 2022 4:23 PM IST
Manushi Chhillar Wants Date With Ram Charan
X

Manushi Chhillar: ఆ టాలీవుడ్‌ హీరోకు పెళ్లి అవ్వకపోతే డేటింగ్‌కు వెళ్లేదాన్ని..

Manushi Chhillar: ప్రపంచ మాజీ సుందరి, ప్రముఖ నటి మానుషి చిల్లర్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు రామ్‌ చరణ్‌ అంటే క్రష్‌ అని రామ్‌చరణ్‌కు ఒకవేళ పెళ్లి కాకపోయి ఉంటే అతనితో డేట్‌కు వెళ్లేదానిని తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమె చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా చూశాక రామ్‌చరణ్‌కు తాను పెద్ద ఫ్యాన్‌ అయిపోయానని మానుషి చిల్లర్ చెప్పింది.

ప్రస్తుతం మానుషి చిల్లర్ ఓ బాలీవుడ్ సినిమాలో నటించింది. అక్షయ్ కుమార్ నటించిన 'పృథ్విరాజ్' చిత్రంలో మానుషి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మీకు ఏ హీరో ఇష్టం అని యాంకర్ అడగ్గా.. మానుషి పై విధంగా స్పందించింది. ఇక అతడికి పెళ్లి అయిపోయింది కదా అని యాంకర్ చెప్పడంతో.. పెళ్లి కాకపోయి ఉంటే డేట్‌కి వెళ్దామా అని చరణ్‌ను తానే స్వయంగా అడిగేదాన్ని అని చెప్పింది. డేటింగ్‌లో ఏం చేస్తారని అడగ్గా.. కలిసి సినిమాలు చూస్తాం, ఇష్టమైన ఫుడ్‌ తింటాం, ఇంకా ఎన్నెన్నో వియాలను మాట్లాడుకుంటామని మానుషి చెప్పుకొచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story