మళ్ళీ ఇన్నాళ్ల తరువాత 'పోకిరి' కాంబో

Puri Jagannadh
x
Puri Jagannadh
Highlights

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మధ్యనే తన కుమారుడు ఆకాష్ పూరి ను లాంచ్ చేస్తూ దర్శకత్వం వహించిన 'మెహబూబా' సినిమా కూడా సరిగా ఆడకపోవడంతో డీలా పడిపోయాడు పూరి.

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మధ్యనే తన కుమారుడు ఆకాష్ పూరి ను లాంచ్ చేస్తూ దర్శకత్వం వహించిన 'మెహబూబా' సినిమా కూడా సరిగా ఆడకపోవడంతో డీలా పడిపోయాడు పూరి. ఇక అలానే ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో రామ్. ఈ మధ్యనే నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్. 'ఇస్మార్ట్ శంకర్' అనే సరికొత్త టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదలైంది.

ఇప్పటిదాకా లవర్ బాయ్ పాత్రలో కనిపించిన రామ్ ఈ సినిమాలో మాత్రం ఒక పక్కా మాస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూరి మార్క్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలలో 'చిరుత' మరియు 'పోకిరి' సినిమాలకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories