Ponniyin Selvan : మణిరత్నం "పోన్నియన్ సెల్వన్" పోస్టర్ విడుదల

Mani Ratnam Latest Movie Ponniyin Selvan Poster Released By Makers Lyca Productions
x

మణిరత్నం "పోన్నియన్ సెల్వన్" పోస్టర్

Highlights

Ponniyin Selvan: ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల "పోన్నియన్ సెల్వన్" కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం...

Ponniyin Selvan: ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల "పోన్నియన్ సెల్వన్" కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం "పోన్నియన్ సెల్వన్" అనే నవల పేరు మీదుగానే తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ విషయాన్నీ చిత్ర నిర్మాణ సంస్థ లైకా మీడియా సోమవారం ట్విట్టర్ వేదికగా అధికారికంగా సినిమా పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తి వంటి స్టార్ హీరో హీరోయిన్స్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.

గతంలో జరిగిన కొన్ని ఇంటర్వ్యూలలో "పోన్నియన్ సెల్వన్" తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఆ నవలని సినిమాగా చేసి వెండితెరపై ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని మణిరత్నం చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమాకి సంబంధించిన నటీనటులను ఎంపిక చేసిన మణిరత్నం ఈ సినిమాని బాహుబలి రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు "పోన్నియన్ సెల్వన్" లోని పాత్రలను కూడా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వెండితెరపై చూపించబోతున్నాడు. ఇక సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories