Manchu Manoj: ఆర్జీవీకి మంచు మనోజ్ కౌంటర్

* 'అందులో మీరు రింగ్ మాస్టర్ సర్' అంటూ మనోజ్ ట్వీట్ * 'మా' పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్

Shilpa
Published on: 19 Oct 2021 1:05 PM IST
Manchu Manoj Counter on Ram Gopal Varma Tweet about Movie Artist Association
X

మంచు మనోజ్ (ఫైల్ ఫోటో)

Manchu Manoj: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఓ విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. రాజకీయ నాయకులు, సినీ తారల పై కూడా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదంపై ఆర్జీవీ తనదైన స్టైల్‌లో స్పందించారు. మా అసోసియేషన్ సర్కస్ అని, రెండు రోజుల కింద ట్వీట్ చేసిన వర్మ, తాజాగా మా వివాదంపై మరో పోస్ట్ చేశారు.

మా ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ ట్వీట్ చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై మంచు మనోజ్ సెటైర్ వేశాడు. 'మా' జోకర్లతో నిండిన సర్కర్ అంటూ ఆర్జీవీ తొలుత ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మనోజ్. అందులో మీరు రింగ్ మాస్టర్ సర్' అంటూ బదులిచ్చాడు.


Shilpa

Shilpa

Next Story