'భారతీయుడు 2' సినిమా పై క్లారిటీ ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్

భారతీయుడు 2 సినిమా పై క్లారిటీ ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్
x
Highlights

ఈ మధ్యనే '2.O'సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ ఇప్పుడు 'భారతీయుడు 2' సినిమా పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో బ్లాక్ బస్టర్...

ఈ మధ్యనే '2.O'సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ ఇప్పుడు 'భారతీయుడు 2' సినిమా పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. కమల్ హాసన్ ఈ సినిమాలో కూడా హీరోగా నటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా దర్శకుడు శంకర్ కు మరియు లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలకు వచ్చిన కొన్ని కలహాలవల్ల సినిమా ఆగిపోనుందని పుకార్లు బయటకు వస్తున్నాయి.

సినిమా కోసం బడ్జెట్ ఇంకా పెంచాలని శంకర్ కోరారని, కానీ ఇంతకు మించి ఇవ్వడం కుదరదంటూ లైకా ప్రొడక్షన్స్ వారు చెప్పారని అలా గొడవ పెద్దది అయిందని వార్తలు సోషల్ మీడియా లో హల్ చల్ చేశాయి. అయితే ఈ మధ్యనే లైకా ప్రొడక్షన్స్ వారు వీటి పై క్లారిటీ ఇచ్చారు. సినిమా ఆగిపోలేదని ఇప్పటికే షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని, మరొక షెడ్యూల్ ను త్వరలో మొదలు పెట్టనున్నామని స్పష్టం చేశారు లైకా ప్రొడక్షన్స్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories