బిగ్ బాస్ నుంచి మహేష్ వెళ్లిపోతాడా....

K V D Varma
Updated on: 13 Oct 2019 12:29 PM IST
బిగ్ బాస్ నుంచి మహేష్ వెళ్లిపోతాడా....
X

ఈరొజు బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. వరుణ్..రాహుల్..మహేష్.. వితిక నలుగురూ ఈవారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. అయితే.. వితిక తనకు గత వారం వచ్చిన లైఫ్ లైన్ ఉపయోగించుకుని సేఫ్ జోన్‌లో నిలిచింది. ఇక మిగిలిన ముగ్గురిలో ఎవరు బయటకు వెళతారనేది ఈ సాయంత్రం తేలనుంది.

వరుణ్ ఏరకంగా చూసినా బయటకు వెళ్ళే అవకాశం లేదు. ఇక మిగిలిన ఇద్దరిలో ఈవారం రాహుల్ అన్నిరకాలుగానూ మెరుగైన ప్రదర్శన చేశాడు. అందువల్ల రాహుల్ కూడా సేఫ్ అయినట్లే.. ఇక మిగిలింది మహేష్ విట్టా.. ఇప్పటికే చాలా సార్లు డేంజర్ జోన్ లోకి వెళ్లి.. కష్టపడి బయటపడ్డాడు. నిజానికి గత వారమే మహేష్ బయటకు వచ్చేసే పరిస్థితి తలెత్తింది. అయితే..అనూహ్యంగా పునర్నవి పై ప్రేక్షకుల లో వ్యతిరేకత పెరగడంతో బతికిపోయాడు. ఇక ఇప్పుడు ఇంటా బయటా మహేష్ పై వ్యతిరేకత ఎక్కువగానే వుంది. అదీకాక బిగ్ బాస్ ఓటింగ్ కాకుండా.. బయట సోషల్ మీడియాలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ లోనూ మహేష్ విట్టా బయటకు వెళతాడని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సో ఈవారం బిగ్ బాస్ నుంచి మహేష్ విట్టా వీడ్కోలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

K V D Varma

K V D Varma

Next Story