మహేష్ కోసం అలాంటికథ తయారవుతోంది..

మహేష్ కోసం అలాంటికథ తయారవుతోంది..
x
Highlights

'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సుకుమార్ మహేష్ బాబు కోసం ఒక యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సుకుమార్ మహేష్ బాబు కోసం ఒక యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వన్ నేనొక్కడినే' సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

అందుకే ఈసారి ఎలాగైనా మహేష్ బాబు కు సూపర్ హిట్ అందించి తీరాలన్న ఆశతో సుకుమార్ ఈసారి మహేష్ కోసం ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక స్టార్ హీరోయిన్ ను ఎంచుకోవాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. 'రంగస్థలం' తో బ్లాకె బస్టర్ అందించిన సుకుమార్ ఈసారి కచ్చితంగా మహేష్ బాబు కు ఒక మంచి హిట్ ను అందిస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories