Mahesh Babu : ఇక్కడ సూపర్ ప్లాప్.. అక్కడ రికార్డుల మోత..ఇదీ సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్!

Mahesh Babu : ఇక్కడ సూపర్ ప్లాప్.. అక్కడ రికార్డుల మోత..ఇదీ సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్!
x

Mahesh babu

Highlights

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత మహేష్ తో మళ్ళీ ఆగడు అనే సినిమాని చేశారు శ్రీను వైట్ల..దూకుడు లాంటి కాంబినేషన్ మళ్ళీ రీపీట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.. దీనితో ఆ అంచనాలను అందుకోలేక ఈ సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.

ఊహించని విధంగా ప్లాప్ అయిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ లో మాత్రం దుమ్ముడులుపుతుంది.. యూట్యూబ్ లో ఈ సినిమాకి ఏకంగా 500 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో ప్లాప్ అయిన ఈ సినిమా 500 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకొని సెన్సేషనల్ రికార్డును నెలకొల్పోడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి... ఈ మార్క్ కూడా బహుశా ఇండియన్ సినిమాలో అందులోను ఒక ప్లాప్ సినిమాకు దక్కడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇక తెలుగులో అంతగా అలరించని సినిమాలు హిందీలోకి డబ్ అయి భారీ వ్యూస్ ని దక్కించుకుంటున్నాయి. అందులో రామ్ హలో గురు ప్రేమ కోసమే, విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్, బెల్లకొండ శ్రీనివాస్ అల్లు శీను చిత్రాలు ఉన్నాయి.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.. మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories