ఆ విషయంలో మహేష్ బాబుకు సరిలేరు ఎవ్వరూ..

ఆ విషయంలో మహేష్ బాబుకు సరిలేరు ఎవ్వరూ..
x
Highlights

సినిమా లలోనే కాదు నిజజీవితంలో కూడా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ను ఫాలో అయిపోతూ 'సరిలేరు నీకెవ్వరూ' అనిపించుకుంటున్నారు ప్రిన్స్ మహేష్ బాబు.

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా చిన్నతనం నుంచే వెండి తెర మీద మేఉపులు మెరిపించారు మహేష్ బాబు. కృష్ణ నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఫ్యాన్స్ తొ ప్రిన్స్ అనిపించుకుని.. ప్రేక్షకులతో ఈతరం సూపర్ స్టార్ గా పిలిపించుకుంటున్నారు. మొన్ననే మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన మహేష్ బాబు ఇప్పుడు 'సరిలేరు నేకెవ్వరు' తో ప్రేస్కహకుల ముందుకు రావడానికి శరవేగంతో ముస్తాబయిపోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మిలటరీ ఆఫీసర్ గా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించనున్నారు. ఇది మహేష్ రీల్ లైఫ్. 

ఇక రియల్ లైఫ్ లో కూడా మహేష్ సూపరే. నమ్రత శిరోద్కర్ ను ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ బాబు సినీ హీరోల్లో కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే వారిలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి నట వారసత్వాన్నే కాదు. కుటుంబ బాధ్యతల విషయంలో ఎంత పద్దతిగా ఉండాలో కూడా అందిపుచ్చుకున్నారు మహేష్ బాబు. అవకాశం దొరికితే చాలు.. కుటుంబంతో కలిసి ట్రిప్ లు వేసేయడం మహేష్ బాబుకు అలవాటు. తన ముద్దుల కొడుకు గౌతమ్.. గారాల పట్టి సితార లను తీసుకుని అలా అలా తిరిగేయడమే కాదు వారితో తాను ఎంజాయ్ చేసిన ప్రతి విషయాన్ని అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటారు సామాజిక మాధ్యమాల ద్వారా మహేష్ బాబు. తన ముద్దుల పిల్లలతో తాను ఉన్న ఫోటోలను ఇటీవల కాలంలో చాలానే పంచుకున్నారు. అవన్నీ అభిమానులతో పాటు, సామాజిక మాధ్యమాల్లో సినిమా తారల విశేషాలను వెతికి చూసే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ విపరీతంగా నచ్చేశాయి. వాటిలో కొన్నిటిని సరదాగా మీకోసం అందిస్తున్నాం. ఈపాటికి మీరూ విడి విడిగా ఎక్కడో అక్కడ వాటిని చూసేసి ఉంటారు.. కానీ సరదాగా మరోసారి ఒక్క చోట పేర్చి చూపిస్తే ఎలావుంటుందనిపింఛి.. వివిధ సందర్భాల్లో ప్రిన్స్ మహేష్ బాబు తన కుటుంబం తో కలసి ఉన్న ఫోటోలు మీకోసం...

మేమిద్దరం.. మాకిద్దరు.. భార్య నమ్రత.. పిల్లలు గౌతం.. సితారలతో సూపర్ స్టార్!


నీ మురిపించే అల్లరికి నేనిచ్చే ముద్దుఅల శిక్ష ఇది అంటూ తనయుడు గౌతమ్ తో ప్రిన్స్ మహేష్ బాబు


నీ నవ్వుచాలు.. ఎంత అలసటైనా మరచిపోతా!


నాన్నా.. అచ్చం నీలానే లేనూ..


ఇప్పుడు ఎలా అల్లరి చేద్దాం..


ఏ సేల్ఫీ అదిరింది చెప్పరూ..














Show Full Article
Print Article
More On
Next Story
More Stories