logo
సినిమా

'మహర్షి' ఎక్కడా ఆగట్లేదుగా

మహర్షి ఎక్కడా ఆగట్లేదుగా
X
Highlights

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన...

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా గా తెరకెక్కనున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ ను ఆగమేఘాల మీద పూర్తి చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం పొల్లాచిలో 'మహర్షి' షూటింగ్ పూర్తయింది.

ఇక ఈ సినిమా యూనిట్ తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇది పూర్తయ్యాక ఆఖరి షెడ్యూల్ ను అబుదాబిలో పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ సినిమాలో మహేష్ స్నేహితుడిగా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.

Next Story