మహేష్, నమ్రతలను కలపిన 'వంశీ'కి 20 ఏళ్ళు!

Vamsi Movie Completes 20 Years : టాలీవుడ్ లో బెస్ట్ కపూల్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ లకి మంచి పేరుంది. అయితే వీరికి ప్రేమకి, వివాహ బంధానికి కారణం మాత్రం 'వంశీ' సినిమా అనే చెప్పాలి.

Krishna
Published on: 4 Oct 2020 1:29 PM IST
మహేష్, నమ్రతలను కలపిన వంశీకి 20 ఏళ్ళు!
X

Mahesh Babu Namrata Shirodkar 

Vamsi Movie Completes 20 Years : టాలీవుడ్ లో బెస్ట్ కపూల్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ లకి మంచి పేరుంది. అయితే వీరికి ప్రేమకి, వివాహ బంధానికి కారణం మాత్రం 'వంశీ' సినిమా అనే చెప్పాలి.. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ కి మధ్య మంచి పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరి పెళ్లిగా మారింది.. అయితే ఈ చిత్రానికి నేటికి(అక్టోబరు 4, 2000) 20 ఏళ్ళు నిండాయి..

బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని పద్మాలయా స్టూడియోస్ పైన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇది మహేష్ బాబుకి తెలుగులో మూడో సినిమా కాగా, నమ్రత శిరోద్కర్‌ కి ఫస్ట్ సినిమా కావడం విశేషం.. మహేష్ తండ్రి కృష్ణ ఈ సినిమాలో కీ రోల్ లో పోషించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంత పెద్ద విజయాన్ని అందుకోనప్పటికి వారిద్దరిని జీవిత భాగ‌స్వాములు అయ్యేలా చేసింది ఈ చిత్రం.. ముందుగా నమ్రత తన ప్రేమను వ్యక్తపరచగా ఆ తర్వాత మహేష్ కూడా ఒకే అనేశాడు!

ఈ సినిమా తర్వాత దాదాపు ఐదేళ్లకి మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ 2005 ఫిబ్రవరి 10 న ముంబైలో హిందూ సంప్రదాయం ప్రకారం అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక పెళ్లి తరవాత కూడా సినిమాలు చేస్తే, కుటుంబానికి ఎక్కడ దూరం కావాల్సి ఉంటుందోనని సినిమాలకి గుడ్ బై చెప్పారు నమ్రత.. అటు మహేష్ సక్సెస్ లో ఎక్కువ భాగం నమ్రతదే నని చెప్పవచ్చు. ఇక మహేష్ , నమ్రత దంపతులకి 2006లో కుమారుడు గౌతమ్ కృష్ణ, 2012లో సితార అనే పాప జన్మించారు.

ఇక అటు మహేష్ బాబు ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మెప్పించాడు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మహేష్ బాబుతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Krishna

Krishna

Next Story