Namrata Shirodkar pre wedding photo: అరుదైన ఫొటోను షేర్ చేసిన నమ్రత!

Namrata Shirodkar pre wedding photo: టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ లో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంట ఒకటి!

Krishna
Published on: 17 July 2020 9:25 PM IST
Namrata Shirodkar pre wedding photo: అరుదైన ఫొటోను షేర్ చేసిన నమ్రత!
X
Namrata Shirodkar Share her pre wedding celebration with Mahesh Babu

టాలీవుడ్ లో బెస్ట్ కపూల్ లలో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఒకరు.. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మొదటిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాతోనే వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత 2005 ఫిబ్రవరి 10 న ముంబైలో హిందూ సంప్రదాయం ప్రకారం మహేష్ , నమ్రతా అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.

అయితే తాజాగా నమ్రతా తన పెళ్లినాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇందులో పెళ్ళికి ముందు చేయించే మంగళస్నానం వేడుకకు సంబంధించి ఒక ఫొటోను నమ్రతా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో నమ్రతా చాలా అందంగా కనిపిస్తున్నారు.

హిందూ సాంప్రదాయ వ్యవస్థలో పెళ్ళికి ముందు మంగళస్నానం చేయించడం అనేది ఓ ఆనవాయితీగా వస్తున్న ఆచారం అన్న సంగతి తెలిసిందే. ఇందులో వధూవరులను పెళ్లి పీటల పైన కుర్చోబెట్టే ముందు వారికి పసుపు రాసి మంగళస్నానం చేయిస్తారు. అయితే తన పెళ్లి వేడుకలో దీనికి సంబంధించిన ఫోటోను నమ్రత షేర్ చేశారు. ప్రస్తుతం దీనికి 106,754 లైక్స్ రాగా, అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.



ఇక మిస్ వరల్డ్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన నమ్రతా ఆ తర్వాత మహేష్ ని పెళ్లి చేసుకొని మొత్తం సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. అటు మహేష్ సక్సెస్ లో ఎక్కువ భాగం నమ్రతదే నని చెప్పవచ్చు. ఇక మహేష్ , నమ్రతా దంపతులకి 2006లో కుమారుడు గౌతమ్ కృష్ణ, 2012లో సితార అనే పాప జన్మించారు.

ఇక అటు మహేష్ బాబు ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మెప్పించాడు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మహేష్ బాబుతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Krishna

Krishna

Next Story