'మహర్షి' వల్ల మారిన లెక్కలు

Ruthvik
Updated on: 24 Feb 2019 12:55 PM IST
మహర్షి వల్ల మారిన లెక్కలు
X

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న మహేష్ బాబు 25వ చిత్రం 'మహర్షి' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సినిమా లో కొన్ని సీన్ల రీ షూట్ వల్ల మరోసారి ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. యూనిట్ సభ్యులు స్పందించక పోవడంతో వార్తలు నిజమే అని అర్థమైంది. ఈ సమయంలోనే 'మహర్షి' వల్ల విడుదల రీ షెడ్యూల్ అవబోతున్నాయి. నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమా ఏప్రిల్ మొదటి లేదా రెండవ వారంలో విడుదల అవ్వాలి కానీ 'మహర్షి' వాయిదా పడటంతో ఏప్రిల్ 19 లేదా 25న విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారట.

లారెన్స్ నటించిన 'కాంచన 3' ఏప్రిల్ రెండవ లేదా మూడవ వారంలో విడుదల వాయిదా పడేలా ఉంది. అటు సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి' కూడా వాయిదా పడేలా ఉంది. 'మహర్షి' చిత్రం విడుదల తేదీ ఎప్పుడు ప్రకటించారో అప్పుడే 'జెర్సీ', 'చిత్రలహరి' 'మజిలీ' విడుదల తేదీలు ప్రకటించారు. కానీ 'మహర్షి' చిత్రం పలు సార్లు వాయిదా పడుతుండడంతో అయితే ఇతర సినిమాల హీరోలు తమ సినిమాలను రీ షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఇక 'మహర్షి' మే లో విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని సమాచారం కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Ruthvik

Ruthvik

Next Story