logo

వాయిదా పడిన మహేష్ బాబు 'మహర్షి' సినిమా ?

Mahesh BabuMahesh Babu
Highlights

'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఈ సినిమా 2019లో వేసవిలో విడుదల కానుందని తెలియజేశారు.

'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఈ సినిమా 2019లో వేసవిలో విడుదల కానుందని తెలియజేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది. ఇప్పటికే యువ హీరోల నాగచైతన్య మరియు సాయి ధరమ్ తేజ్ వారి సినిమాలను ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగచైతన్య, సమంత నటించిన 'మజిలి' సినిమా ఏప్రిల్ 5న విడుదల అవుతుండగా, సాయి ధరమ్ తేజ్ నటించిన 'చిత్రాలహరి' ఏప్రిల్ రెండవ వారంలో విడుదల కానుంది.

మహేష్ కన్నా మార్కెట్ తక్కువ ఉన్న ఈ ఇద్దరు హీరోలు మహేష్ బాబు సినిమాకు పోటీగా ఏప్రిల్లోనే విడుదల చేయాలి అనుకోవడానికి కారణం మహేష్ సినిమా వాయిదా పడటమే అని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. పైగా దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలో ఒక సినిమా పూర్తి చేయడానికి చాలా కాలం తీసుకుంటాడు అనే విషయం తెలిసిందే. పైగా ఇది మహేష్ 25 వ చిత్రం కావడం వలన మరింత జాగ్రత్తగా సినిమా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న వంశీ పైడిపల్లి ఈ సినిమాను మరింత ఆలస్యంగా విడుదల చేయబోతున్నాడని ఫిలిం నగర్ లో కొందరు గుసగుసలాడుతున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 26వ తారీఖున కానీ లేక మే మొదటి వారంలో కానీ విడుదలవుతుందని సమాచారం.

లైవ్ టీవి

Share it
Top