logo
సినిమా

మహర్షి కి మహేష్ డబ్బింగ్ షురూ

మహర్షి కి మహేష్ డబ్బింగ్ షురూ
X
Highlights

వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమైన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్టకేలకు 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్...

వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమైన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్టకేలకు 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు 'మహర్షి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లో 25వ సినిమా గా విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు 3 డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇంకా ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దర్శక నిర్మాతలు డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టారు. మహేష్ బాబు ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పడంలో నిమగ్నమయ్యాడు. దిల్ రాజు, అశ్వినీ దత్ మరియు పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ ఆఖరి వారంలో విడుదల కానుంది.

Next Story