పూజాహెగ్డేకు సూపర్ స్టార్ మైండ్ బ్లోయింగ్ షాక్.. డీలా పడ్డ బుట్ట బొమ్మ..?

Mahesh Babu Give Big Shock to Pooja Hegde
x

పూజాహెగ్డేకు సూపర్ స్టార్ మైండ్ బ్లోయింగ్ షాక్.. డీలా పడ్డ బుట్ట బొమ్మ..?

Highlights

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే టైమ్ అస్సలు బాగోలేదు.

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే టైమ్ అస్సలు బాగోలేదు. ఎక్కడ కాలు పెడితే అక్కడ ఫ్లాపులు వెక్కిరిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడంతో ఆమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. కట్ చేస్తే ఇప్పుడు పూజా పేరు చెబితే చాలు బెంబేలెత్తిపోతున్నారు. గోల్డెన్ లెగ్ అని ఎవరైతే ఆకాశానికి ఎత్తశారో వాళ్లే ఇప్పుడు ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేయడంతో పూజా హెగ్డే తట్టుకోలేకపోతోంది. కామెంట్స్ కి తగ్గట్టే ఈ బుట్ట బొమ్మ చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బాల్చీ తన్నేస్తున్నాయి.

తెలుగులో వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఈ వెండితెర బుట్ట బొమ్మ ఫ్లాపుల విషయంలో కూడా డబుల్ హ్యాట్రిక్ క్రియేట్ చేసింది. అల వైకుంఠపురం తర్వాత చెప్పుకోవడానికి ఒక్క హిట్టు లేదు. అక్కినేని అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. కోలీవుడ్ లో బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కినా అవి ఆమెకు చేదు ఫలితాలనే మిగిల్చాయి. తమిళ సూపర్ స్టార్ విజయ్ జోడీగా చేసిన బీస్ట్, బాలీవుడ్ లో క్రేజీ హీరో రణవీర్ సింగ్ కాంబినేషన్ లో చేసిన సర్కస్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో చేసిన రాధేశ్యామ్, మెగా మూవీ ఆచార్య ఇక బాలీవుడ్ బీయింగ్ హ్యూమన్ సల్మాన్ ఖాన్ తో చేసిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ కూడా పూజా హెగ్డేకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.

ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #SSMB 28 సినిమాలో నటిస్తోంది. ఈ ఒక్క ప్రాజెక్టే ఆమె చేతిలో ఉంది. ఈ సినిమాతో గురూజీ త్రివిక్రమ్ తనకు గ్యారెంటీగా హిట్టు ఇస్తాడని బుట్టబొమ్మ గట్టి నమ్మకం పెట్టుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజా డెవలప్ మెంట్స్ పూజాను ఆందోళనకు గురి చేస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ తో సినిమా షూటింగ్ ఆగిపోవడం బుట్టబొమ్మను నిరాశలోకి నెట్టింది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఒక్క సినిమా కూడా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడడంతో పూజా డిప్రెషన్ లోకి వెళ్లిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరి, ఇలాంటి గడ్డు తరుణంలో పూజను ఏ నిర్మాత ఆదుకుంటాడో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories