మహేష్ ఫ్యాన్స్ లో మొదలైన కంగారు

టాలీవుడ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా వచ్చే పేరు దేవి శ్రీ ప్రసాద్. ఫాన్స్ అందరు రాక్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే దేవిశ్రీ కి సాటి ఎవరూ లేరు, రారు. అయితే గత కొంత కాలంగా ఫ్యాన్స్ కూడా డిఎస్పీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
టాలీవుడ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా వచ్చే పేరు దేవి శ్రీ ప్రసాద్. ఫాన్స్ అందరు రాక్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే దేవిశ్రీ కి సాటి ఎవరూ లేరు, రారు. అయితే గత కొంత కాలంగా ఫ్యాన్స్ కూడా డిఎస్పీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల్లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న 'వినయ విధేయ రామ' మరియు వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ సినిమా సినిమాలకు ఆడియో ఇచ్చింది దేవి నే. అయితే ఈ రెండు సినిమాల్లోనూ పాటలు అంతగా ప్రేక్షకులను మెప్పించింది లేదు. గతేడాది 'రంగస్థలం', 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత పలు సినిమాలకు సంగీతం అందించినప్పటికీ వాటి క్వాలిటీ బాలేదు అంటూ కామెంట్లు వినిపించాయి.
ఇక ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'మహర్షి' సినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. మహేష్ 25వ సినిమా ఇది. ల్యాండ్ మార్క్ సినిమా కాబట్టి కచ్చితంగా అన్ని రకాలుగా హిట్ అవ్వాలి అంటే సంగీతం పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించాలి. కానీ అసలు ఈ మధ్య ఫార్మ్ లో లేని దేవిశ్రీప్రసాద్ ఎలాంటి సంగీతం అందిస్తాడు అని ఫ్యాన్స్ అందరూ భయపడుతున్నారు. ఒకవేళ ఈ సినిమా లో పాటలతో పెద్దగా మెప్పించలేదు అంటే ఇక దేవిశ్రీ కెరీర్ కు పెద్ద ముప్పు పొంచి ఉందని చెప్పుకోవచ్చు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT