logo
సినిమా

మహాశివరాత్రి కి 'మహర్షి' గిఫ్ట్

మహాశివరాత్రి కి మహర్షి గిఫ్ట్
X
Highlights

'భరత్ అనే నేను' సినిమా తో రికార్డులను సృష్టించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లో 'మహర్షి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

'భరత్ అనే నేను' సినిమా తో రికార్డులను సృష్టించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లో 'మహర్షి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పొల్లాచి లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. కాలేజీ స్టూడెంట్ గా కనిపించిన మహేష్ ఈ మధ్యనే విడుదలైన పోస్టర్ లో సీఈవో గా కనిపించిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత మళ్లీ సినిమా గురించి ఎటువంటి ప్రమోషనల్ మెటీరియల్ బయటికి రాలేదు. తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి రోజున 'మహర్షి' టీం మహేష్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వనుందని తెలుస్తోంది. మార్చి 4 వ తేదీన ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయాలని 'మహర్షి' దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది కానీ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పివిపి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story