సినిమా కంట్రోల్ మొత్తం దిల్ రాజు చేతుల్లోనే ఉందా

సినిమా కంట్రోల్ మొత్తం దిల్ రాజు చేతుల్లోనే ఉందా
x
Highlights

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే....

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు మిగతా ఇద్దరు నిర్మాతలు కంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు హడావిడి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.

'మహర్షి' సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోంది. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ మొత్తం దిల్ రాజు కంట్రోల్లోనే ఉందని పుకార్లు గుప్పుమంటున్నాయి. అశ్వినీ దత్ మరియు పీవీపీ ఈ సినిమా విషయంలో అసలు సినిమా జోక్యం చేసుకోవడం లేదని ప్రచారాలు సాగుతున్నాయి. షూటింగ్ మొదటి రోజు నుంచి డబ్బింగ్ పనుల వరకు దిల్ రాజు అన్నిటినీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అందుకే మిగతా ఇద్దరు నిర్మాతల కంటే తనకు ఈ సినిమా పై తనకు ఎక్కువ హక్కు ఉంది అన్నట్టు భావిస్తున్నాడట దిల్ రాజు. మరి ఏప్రిల్ లో విడుదల కానున్న ఈ సినిమ ప్రమోషన్లలో అయినా మిగతా ఇద్దరు నిర్మాతలు కనిపిస్తారా లేక దిల్ రాజే అన్నీ చూసుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories