ఇంటర్వెల్ ముందు ఒక సర్ప్రైజ్ ఇవ్వనున్న మహేష్

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Ruthvik
Published on: 19 Jan 2019 8:54 AM IST
Maharshi
X
Maharshi

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం మహేష్ కాలేజ్ స్టూడెంట్ లాగా కనిపించనున్నారట. ఇక కాలేజీ స్టూడెంట్ గా సరి కొత్త లుక్ తో కనిపించనున్న మహేష్ చదువు పూర్తి చేసుకొని అమెరికా వెళ్లి అక్కడ బిజినెస్ లో చేరి అమెరికాలోని ఒక పెద్ద కంపెనీకి సీఈవోగా మారతాడు.

ఇక ఈ సినిమా మొత్తం మీద ఇంటర్వల్ బ్యాంగ్ చాలా కీలకంగా మారనుందని సమాచారం. వంశీ పైడిపల్లి ఇంటర్వెల్ లో ఒక పెద్ద ట్విస్ట్ ను ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఆ ట్విస్ట్ తో ఆడియన్స్ కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని సమాచారం. ఇంటర్వెల్ సీన్ లో అల్లరి నరేష్ పాత్ర కూడా కీలకమైన ఉండబోతోందని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతుందట. తన ప్రాణ స్నేహితుడైన అల్లరి నరేష్ ఎలా కష్టాల్లో కూరుకుపోతాడు ఆ కష్టాల నుంచి మహేష్ తనని ఎలా కాపాడతాడు అనేది తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యేంత వరకు మనం ఆగాల్సిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ చివరి వారంలో విడుదల కానుంది.

Ruthvik

Ruthvik

Next Story