సినిమా షూటింగ్‌లకు ఓకే చెప్పిన ప్ర‌భుత్వం

Maharashtra Government to permit Bollywood Film Shootings
x

 Film Shootings (Thehansindia)

Highlights

Bollywood: కరోనా సెకండ్‌వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై పండింది.

Bollywood: కరోనా సెకండ్‌వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై పండింది. ఈ నేప‌థ్యంలో క‌రోనా కార‌ణంగా సినిమా, సీరియ‌ల్స్ షూటింగ్స్ నిలిచిపోయాయి. తొలుత మ‌హారాష్ట్రలో చిత్రీక‌ర‌ణ నిలిచిపోయాయి. ఈ నేప‌థ్యంతో క‌రోనా సెకండ్ వేవ్ కేసులు త‌గ్గుముఖం పట్ట‌డంతో ఆ రాష్ట్రా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సినిమా షూటింగ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినిమా/టెలివిజన్‌ షూటింగ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు.

మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య ఆధారంగా ఆయా ప్రాంతాల్ని స్థాయిలవారీగా విభజించి లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఎత్తివేసింది. పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ని పూర్తిగా ఎత్తివేసింది. అక్కడ థియేటర్లలో సినిమా ప్రదర్శనలకీ అనుమతులు ఇచ్చింది. ఈ నెల 7 నుంచే బాలీవుడ్‌ వర్గాలు చిత్రీకరణలకి సిద్ధం అవుతున్నాయి.

ఆదివారం చిత్ర పరిశ్రమ, టెలివిజన్‌ పరిశ్రమవర్గాల ప్రతినిధులతో వర్చువల్‌గా జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ఉద్ధవ్‌ విజ్ఞప్తి చేశారు. పరిశ్రమకు చెందిన ఆదేశ్‌ బందేకర్‌, నితిన్‌ వైద్య, ప్రశాంత్‌ దాల్మి, భరత్‌జాదవ్‌, సిద్ధార్థ్‌రాయ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ''రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో సినిమా/టీవీ షూటింగ్‌లు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి అదుపులోకి వచ్చింది. అన్‌లాక్‌ ప్రక్రియలో నిబంధనల మేరకు భాగంగా షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం''అని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories