ప్రభాస్ యాక్షన్ డైరెక్టర్ ఇపుడు అనుష్క కోసం

ప్రభాస్ యాక్షన్ డైరెక్టర్ ఇపుడు అనుష్క కోసం
x
Highlights

ఈ మధ్యనే 'భాగమతి' సినిమా తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని తన తర్వాత సినిమాను...

ఈ మధ్యనే 'భాగమతి' సినిమా తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని తన తర్వాత సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధమవుతోంది. 'సైలెంట్' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో మాధవన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'వస్తాడు నా రాజు' ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నారు. కోన వెంకట్ మరియు గోపి మోహన్ సంయుక్తంగా ఈ సినిమాకు కథను అందించారు.

అయితే ఒక హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఈ సినిమాకు పని చేయనున్నారు. ఆయన బాబ్ బ్రౌన్. "హాలీవుడ్ లో ని ఇంత అద్భుతమైన యాక్షన్ డైరెక్టర్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన పనిచేసిన సినిమాల్లో నాకు 'ది వాల్', 'ప్రిడేటర్స్', 'ఐరన్ మాన్', 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్', ది జనరల్స్ డాటర్', 'ది డే ఆఫ్టర్ టుమారో' నాకు చాలా ఇష్టం. ప్రభాస్ 'సాహో' సినిమా కు యాక్షన్ డైరెక్టర్ గా పని చేసిన బాబ్ బ్రౌన్ మా సినిమాలో కూడా పని చేయనున్నారు." అని కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలో జరుగనున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories