Top
logo

సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..

సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..
X
Highlights

టాలీవుడ్ ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అస్వస్థతకు గురయ్యారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అశోక్ ...

టాలీవుడ్ ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అస్వస్థతకు గురయ్యారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అశోక్ తేజ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేపు ఆయనకు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో అశోక్ తేజకు బంధువైన సినీ నటుడు ఉత్తేజ్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

మామయ్య అశోక్ తేజ్ అనారోగ్యంతో ఉన్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని ఉత్తేజ్ తెలిపారు. ఈరోజు ఆయన ఆసుపత్రిలో చేరారని రేపు సాయంత్రం ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు. సర్జరీ సమయంలో రక్తం అవసరమవుతుందేమో అని మామయ్య ఇటీవల తన స్నేహితుడితో చెప్పారు. ఈ విషయాన్ని ఆ స్నేహితుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో రకరకాల వార్తలు వస్తోన్నాయి. రక్తం అవసరమున్న మాట వాస్తవమే.. ఆ విషయంపై నేను చిరు బ్లడ్‌బ్యాంక్‌కు కాల్‌ చేశాను. వాళ్లు స్పందించి రక్తదాతలను పంపిస్తామన్నారు. మామయ్య (అశోక్ తేజ) గురించి తెలిసి ఈ ఉదయం చిరంజీవి గారు ఫోన్ చేశారని మామయ్యతో మాట్లాడి ధైర్యం చెప్పారని అన్నారు.

Web TitleLyric Writer Suddala Ashok Teja admitted to hospital, needs Liver transplantation
Next Story