Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం షార్ప్ షూటర్ ని పెట్టిన హంతకుడు

Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం షార్ప్ షూటర్ ని పెట్టిన హంతకుడు

Rama Rao
Updated on: 12 Jun 2022 2:31 PM IST
Lawrence Bishnoi Gang Spies on Salman Khan | Bollywood News
X

Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం షార్ప్ షూటర్ ని పెట్టిన హంతకుడు

Salman Khan: సింగర్ మరియు రాజకీయ నాయకుడు అయిన సిద్దూ మూస్ వాలా ఆకస్మిక మరణం వెనుక ఉన్న షాకింగ్ నిజాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. ఆ కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ తాజాగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై హత్యా యత్నం చేశారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్ ని ఉంచారని తెలుస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్ ఇంటికి దగ్గర ఒక షార్ప్ షూటర్ ని కూడా పెట్టడం జరిగిందట. కానీ ఆఖరి నిమిషంలో ప్లాన్ ఫెయిల్ అయిందని తెలుస్తోంది. నిజానికి సల్మాన్ ఖాన్ సైక్లింగ్ కి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ లు ఎవరూ తనతోపాటు రారు. ఆ సమయాన్ని అదునుగా తీసుకుంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.

సల్మాన్ ఖాన్ ఇంటిదగ్గర పోలీస్ బండి చూసి ఆ షార్ప్ షూటర్ ప్లాన్ నుంచి తప్పకుందట. ఇక సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కి వచ్చిన లెటర్ మీద ఉన్న ఎల్ బీ మరియు జీ బీ లను లారెన్స్ మరియు అతని కెనడా గ్యాంగ్ పేర్లు గా గుర్తించారు. ఇక మరో వైపు సిద్దూ మూస్ వాలా హత్య కూడా చేశారని ప్రచారం జరుగుతోంది కానీ బిష్ణోయ్ ఈ హత్యలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదని ఎవరో తనతో చేయించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story