పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కి పునాకలే..

పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కి పునాకలే..
x

NTR 

Highlights

NTR Role : కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి .

NTR Role : కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ కాంబో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి.. ఇందులో ఎన్టీఆర్ ప్రపంచాన్నే గడగడలాడించనున్న పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా ఎన్టీఆర్‌ని చూపించబోతున్నారని తెలుస్తోంది.

ఈ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ కాబోతున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. బయోవార్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి 'మిస్సైల్' అనే టైటిల్ ని అనుకుంటున్నట్టుగా సమాచారం.. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దాదాపుగా 300 కొట్లతో పాన్ ఇండియా మూవీగా నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపైన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకున్నా సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇది అని తెలియగానే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి..

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా పైన భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమాని చేయనున్నాడు ఎన్టీఆర్.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి రానుంది..

Show Full Article
Print Article
Next Story
More Stories