Janhvi Kapoor : ఎన్టీఆర్‌ జోడీగా జూనియర్ శ్రీదేవి?

Janhvi Kapoor : అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న

Krishna
Published on: 5 Sept 2020 12:40 PM IST
Janhvi Kapoor : ఎన్టీఆర్‌ జోడీగా జూనియర్ శ్రీదేవి?
X

Jr NTR, Janhvi Kapoor 

Janhvi Kapoor : అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నదానిపైన ఆసక్తి నెలకొంది. గత రెండు చిత్రాలకి పూజా హేగ్దేనే రిపీట్ చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాకి కూడా పూజా ఫిక్స్ చేశాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్‌కు జోడీగా అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకి కథను వినిపించినట్టు సమాచారం.. త్వరలో దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజం అయితే జాన్వీకపూర్‌ టాలీవుడ్ లో చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. ఇక ఎన్టీఆర్ తాత నందమూరి తారకరామారావు, జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి కలిసి చాలా సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే..

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా పైన భారీ అంచనాలు పెరిగాయి.

Krishna

Krishna

Next Story