ప్రెషర్ కుక్కర్ మూవీని వీక్షించిన మంత్రి కేటీఆర్‌

ప్రెషర్ కుక్కర్ మూవీని వీక్షించిన మంత్రి కేటీఆర్‌
x
Highlights

రామానాయుడు స్టూడియోలో ప్రెషర్ కుక్కర్ మూవీని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వీక్షించారు. "డాలర్ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికా వెంట పరుగులు పెడుతున్నారన్న...

రామానాయుడు స్టూడియోలో ప్రెషర్ కుక్కర్ మూవీని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వీక్షించారు. "డాలర్ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికా వెంట పరుగులు పెడుతున్నారన్న కంటెంట్‌ను అందరికీ అర్థం అయ్యేలా సినిమా తీశారని కేటీఆర్ తెలిపారు. మూవీ డైరెక్టర్‌ సుజయ్ తనకు మంచి మిత్రుడని, బెంగళూర్‌లో ఉంటున్న ఆయన్ని కలిసి పనిచేద్దామని తానే హైదరాబాద్‌కు రమ్మన్నట్లు కేటీఆర్ వివరించారు.. గతంలో తన ఫొటోగ్రాఫ్ తో , పెయింటింగ్స్ తో నన్ను ఆశ్చర్యపరిచిన సుజయ్..తాజాగా తన తమ్ముడితో కలిసి సినిమా తీశానని చెప్పి నన్ను మరింత సర్ప్రైజ్ చేశాడని అన్నారు.

సినిమా బాగుందని, సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను " అన్నారు. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ చిత్రం నిన్న విడుదలైంది. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి ('జార్జిరెడ్డి' ఫేమ్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకత్వం వహించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories