స్పెషల్ సాంగ్ కోసం మహేష్ హీరోయిన్

Ruthvik
Published on: 3 Feb 2019 2:27 PM IST
స్పెషల్ సాంగ్ కోసం మహేష్ హీరోయిన్
X

మొదటి సినిమా నే డిజాస్టర్ గా మారితే ఆ ఎఫెక్ట్ తర్వాత సినిమాల పై పడుతుంది అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కు కూడా అదే జరిగింది. తెలుగులో ఈమె మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు అందలేదు. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన 'దోచేయ్' సినిమా లో ఈమె హీరోయిన్ గా నటించింది కానీ ఆ సినిమా కూడా సరిగా ఆడకపోవడంతో కృతిసనన్ పూర్తిగా బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది.

ప్రస్తుతం బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ సరసన 'లుకా చుప్పి' అనే సినిమాలో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఒక పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించే అవకాశం దక్కింది. కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 'కలన్క్' సినిమాలో వరుణ్ ధవన్, ఆదిత్యరాయ్ కపూర్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాలో స్పెషల్ పాట కోసం కృతిసనన్ ను సంప్రదించగా ఆమె కూడా ఓకే చెప్పిందట. ఈ సినిమా ఈ సంవత్సరం ఏప్రిల్లో విడుదల కానుంది.

Ruthvik

Ruthvik

Next Story