ఎస్ వీ ఆర్ పై బయోపిక్ తీయాలి అంటున్న సీనియర్ హీరో

ఎస్ వీ ఆర్ పై బయోపిక్ తీయాలి అంటున్న సీనియర్ హీరో
x
Highlights

'మహానటి' పుణ్యమా అని టాలీవుడ్లో వరుసగా బయోపిక్ ల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఈమధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం విడుదలైంది.

'మహానటి' పుణ్యమా అని టాలీవుడ్లో వరుసగా బయోపిక్ ల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఈమధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం విడుదలైంది. ఇక రెండవ భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఘంటసాల లాంటి వారిపై బయోపిక్ లు ఇంకా షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఎస్.వి.రంగారావు పైన బయోపిక్ తీస్తే బాగుంటుందని చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.

మీడియాతో మాట్లాడుతూ 'మహానటి' చాలా అద్భుతంగా ఉందని ఎవరైనా ఎస్.వి.రంగారావు పై బయోపిక్ తీస్తే బాగుంటుందని అందులో ఎస్వీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ అయితే ఇంకా బాగుంటుందని అన్నారు. ఎస్వీఆర్ కెరీర్ లో చాలా అద్భుతమైన పాత్రలను పోషించి స్టార్ గా ఎదిగారని, ఆయన పాత్రలో ప్రకాష్ రాజ్ తప్పకుండా న్యాయం చేయగలరని ఆయన పేర్కొన్నారు. అయితే ఎస్ వీ ఆర్ పై బయోపిక్ ను కృష్ణంరాజు స్వయంగా నిర్మిస్తే చాలా బాగుంటుందని కొందరు అంటున్నారు. మరి ఫ్యాన్స్ ఊహలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories