Krack: 'క్రాక్' మూవీ ట్విట్టర్ రివ్యూ

Krack:  క్రాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ
x
Highlights

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్రధానపాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా 'క్రాక్'‌.

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్రధానపాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా 'క్రాక్'‌. కరోనా లాక్‌డౌన్ అనంతరం దాదాపు 9 నెలల తర్వాత పెద్ద హీరో నటించిన చిత్రం నేరుగా థియేటర్స్‌లో విడుదలైంది. సంక్రాంతి పండగను పురస్కరించుకొని క్రాక్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రవితేజ పోలీసు పాత్రలో పోతరాజు వీర శంకర్‌గా అదరగొట్టాడు. ఇక ఇతర పాత్రల్లో సీనియర్ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రిలీజై మంచి టాక్‌నే సొంతం చేసుకున్నట్టు ట్విట్టర్‌ రివ్యూలో పేర్కొన్నారు.

విక్రమార్కుడు తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించినట్టు ఆడియన్స్ పేర్కొంటున్నారు. రవితేజ, శృతి హాసన్‌తో రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయట. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది. అప్పట్లో వరస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు బలుపు సినిమాతో చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. ఈ ట్విట్టర్‌ రివ్యూలు ఓ సారి లుక్కేయండి.







Show Full Article
Print Article
Next Story
More Stories